బిగ్‌బాస్ షోపై స్పష్టత ఇచ్చిన హెబాపటేల్

Mon,July 16, 2018 06:03 PM
hebah patel clarifies about bigboss show

బిగ్‌బాస్ 2 రియాలిటీ షో కొత్త కొత్త టాస్క్‌లతో ఆసక్తికరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. షో మధ్యలో సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా హీరోహీరోయిన్లు బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లి సందడి చేస్తుంటారు.

కుమారి 21 ఎఫ్ ఫేం హెబా పటేల్ కొంతకాలంగా సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించకపోవడంతో ..హెబా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ హౌజ్‌లోకి రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెట్టింది హెబాపటేల్. తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం లేదని, చేతినిండా సినిమాలతో తీరికలేకుండా ఉన్నానని హెబా చెప్పినట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. మరి బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చే తర్వాత సెలబ్రిటీ ఎవరో చూడాలి. హెబాపటేల్ నటించిన 24 కిస్సెస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

6753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles