రెండు సినిమాల నిలుపుదలకు హైకోర్టు నో

Tue,March 19, 2019 03:31 PM
HC Says cannot intervene in Laxmis NTR, Laxmis Veeragrandham release


హైదరాబాద్ : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, లక్ష్మీస్‌ వీరగ్రంథం సినిమాల విడుదల నిలిపేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల నేపథ్యంలో..పై రెండు సినిమాల విడుదలను నిలిపేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సత్యనారాయణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు..రెండు సినిమాల విడుదల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెరకెక్కించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ త్వరలో సెన్సార్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకురానుంది. మరోవైపు వీరగ్రంథం వెంకట సుబ్బారావు జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మీపార్వతి.. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించడం ..అనంతరం ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తమిళ నాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం’ సినిమా తెరకెక్కించారు.

4275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles