హర్యానాలోనూ తప్పని నిషేధం

Tue,January 16, 2018 03:42 PM
Haryana too bans Padmaavat

సంజయ్ లీలా భన్సాలీ పద్మావత్ కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. టైటిల్ మార్చడంతోపాటు సీబీఎఫ్‌సీ చెప్పినట్లు కొన్ని ఎడిట్స్, డిస్‌క్లెయిమర్స్ వేసినా.. రాష్ర్టాలు మాత్రం ఆ సినిమాను కరుణించడం లేదు. గతంలో గుజరాత్, రాజస్థాన్.. ఇప్పుడు హర్యానా.. పద్మావత్‌ను నిషేధించిన రాష్ర్టాల జాబితాలో చేరాయి. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ర్టాలే కావడం విశేషం. సినిమాను చూసి నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చెప్పిన మరుసటి రోజే నిషేధం విధించారు. భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హర్యానా మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో చర్చించామని, మంత్రులంతా నిషేధానికి మొగ్గు చూపారని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు రాజ్‌పుత్ కర్ణిసేన మూవీకి వ్యతిరేకంగా నిరసనలను కొనసాగిస్తూనే ఉన్నది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలూ సినిమాపై నిషేధం విధించాలని కర్ణిసేన డిమాండ్ చేస్తున్నది. ఈ మూవీని బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది.

1449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles