రేప్ కేసులో లొంగిపోనున్న హాలీవుడ్ ప్రొడ్యూసర్

Fri,May 25, 2018 11:54 AM
Harvey Weinstein expected to surrender in rape case

న్యూయార్క్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న హాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ హార్వే వెయిన్‌స్టీన్ .. ఓ రేప్ కేసులో ఇవాళ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. వెయిన్‌స్టీన్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలోనే.. హాలీవుడ్‌లో మీ టూ ఉద్యమం మొదలైంది. 66 ఏళ్ల వెయిన్‌స్టీన్.. అమెరికా ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అనేక నెలల పాటు సాగిన దర్యాప్తు తర్వాత ఆయన లొంగిపోయేందుకు అంగీకరించారు. న్యూయార్క్‌లోని మన్‌హటన్ పోలీసులు ఆయనపై క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేయనున్నారు. ఆ తర్వాత అతన్ని కోర్టుకు తీసుకెళ్లనున్నారు. అయితే ముందే బెయిల్ ప్యాకేజీ ఒప్పందం కుదిరింది. పది లక్షల డాలర్ల బెయిల్ కోసం అంంగీకారం కుదింది. అంతేకాదు ఓ మానిటరింగ్ డివైస్‌ను కూడా అతను తీసుకెళ్లాలి. పాస్‌పోర్ట్‌ను కూడా సరండర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ రేప్ కేసును వెయిన్‌స్టీన్‌పై నమోదు చేయనున్నారు. ఇంకో ఘటనలో థార్డ్ డిగ్రీ రేప్ కేసు నమోదు చేయనున్నారు. లూసియా ఇవాన్స్ అనే మోడల్ చేసిన ఫిర్యాదు మేరకు క్రిమినల్ సెక్స్ యాక్ట్ కింద కేసును ఫైల్ చేయనున్నారు. మరో కేసులో బాధితురాలిని పబ్లిక్‌గా ఇంకా ప్రకటించలేదు. వెయిన్‌స్టీన్‌కు చెందిన ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు దర్యాప్తు చేశారు.

1478
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS