పవన్ మూవీని వదులుకున్న హర్షవర్థన్ !

Tue,February 7, 2017 05:01 PM
harshavardhan drops out from pavan movie


హైదరాబాద్: నటుడు, రచయిత హర్షవర్ధన్ టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీని వదులుకున్నారు. కాటమరాయుడు తర్వాత పవన్‌కళ్యాణ్ తమిళ డైరెక్టర్ ఆర్‌టీ నేసన్ డైరెక్షన్‌లో వేదాళం రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర నుంచి హర్షవర్ధన్ తప్పుకున్నట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొన్నాయి. హర్షవర్ధన్ స్వీయ దర్శకత్వంలో ‘గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ’ అనే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని చేస్తుండటంతో, పవన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. హర్షవర్ధన్‌తోపాటు శ్రీముఖి, తమిళ నటుడు కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అంజిరెడ్డి నిర్మిస్తున్నారు.

414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles