3.3 కోట్లకు అమ్ముడుపోయిన టెర్మినేటర్ బైక్

Mon,July 9, 2018 01:36 PM
Harley Davidson bike rode by Arnold Schwarzenegger in Terminator 2 sold for over 3 crores in Auction

హాలీవుడ్‌లో టెర్మినేటర్ మూవీ సిరీస్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే కదా. అలాగే ఈ సిరీస్‌లో నటించిన యాక్షన్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్‌నిగర్, అతడు వాడిన హార్లీ డేవిడ్‌సన్ బైక్ కూడా అంతే హిట్టయింది. ఈ కంపెనీ ఫ్యాట్ బాయ్ మోడల్‌ను 1991లో వచ్చిన టెర్మినేటర్ 2 మూవీలో ఆర్నాల్డ్ రైడ్ చేయడంతో అది ఎక్కువగా అమ్ముడుపోయిన హార్లీ డేవిడ్‌సన్ మోడల్‌గా రికార్డు సృష్టించింది. ఆర్నాల్డ్ ఆ మూవీలో రైడ్ చేసిన బైక్‌ను ఈ మధ్యే ఐకాన్స్ అండ్ లెజెండ్స్ వేలం వేసింది. దీనికి 2 లక్షల నుంచి 3 లక్షల డాలర్లు వస్తాయని అనుకున్నారు. కానీ అది ఏకంగా 4,80,000 డాలర్లకు అమ్ముడుపోయింది.

అంటే మన కరెన్సీలో సుమారు రూ.3.3 కోట్లు. ఆ మూవీలోని అద్భుతమైన స్టంట్ సీన్స్‌లో కనిపించిన ఈ బైక్.. ఇప్పటివరకు కేవలం వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇప్పుడు కూడా మంచి కండిషన్‌లో ఉండటం విశేషం. ఈ బైక్‌తోపాటు ఆర్నాల్డ్ ష్వాజ్‌నిగర్ టెర్మినేటర్ ఫస్ట్ పార్ట్‌లో వేసుకున్న లెదర్ జాకెట్‌ను కూడా వేలం వేశారు. ప్రస్తుతం ఇదే హార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్ బాయ్ మోడల్ ధర ఇండియాలో రూ.18 లక్షలుగా ఉంది.

2268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles