ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్‌గా హ‌రితేజ‌..?

Thu,October 12, 2017 11:17 AM
hariteja might be the new anchor for extra jabardasth show

తెలుగులో బిగ్‌బాస్ షోతో కోట్ల మంది అభిమానుల‌ను సంపాదించుకుంది హ‌రితేజ‌. గ‌తంలో ఆమె యాంక‌ర్ గా ప‌నిచేసింది. ప‌లు సినిమాల్లోనూ న‌టించింది. కానీ అంత‌గా గుర్తింపు రాలేదు. ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ షో ద్వారా ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయింది. అయితే ఇప్పుడ‌దే పాపులారిటీ హ‌రితేజ‌కు ఎన్నో అవ‌కాశాల‌ను తెచ్చి పెడుతున్న‌ది. అందులో భాగంగానే ఈటీవీలో వ‌స్తున్న ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలో ర‌ష్మికి బ‌దులుగా ఇప్పుడు హ‌రితేజ వ‌స్తుంద‌నే టాక్ సోష‌ల్ మీడియాలో బాగా వినిపిస్తున్న‌ది.

మొద‌ట్లో జ‌బ‌ర్ద‌స్త్ పేరిట నిర్వ‌హించిన కామెడీ షోకు అన‌సూయ యాంక‌ర్‌గా ఉండేది. ఆ త‌రువాత ఆమె షో నుంచి వెళ్ల‌గానే ర‌ష్మికి ఆ చాన్స్ వ‌చ్చింది. అనంత‌రం ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ పేరిట మ‌రో షోను స్టార్ట్ చేశారు. అయితే దీనికి ర‌ష్మిని యాంక‌ర్‌గా మార్చారు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ షోకు ఎప్ప‌టిలాగానే మ‌ళ్లీ యాంక‌ర్‌గా అన‌సూయ‌ను తీసుకున్నారు. కాగా ఈ షోను చిత్రీక‌రిస్తున్న మ‌ల్లెమాల టీం ఇప్పుడు ఎక్స్‌ట్రా జ‌బ‌ర్దస్త్ నుంచి ర‌ష్మిని త‌ప్పించి ఆమె స్థానంలో బిగ్‌బాస్ ఫేం హ‌రితేజ‌ను తీసుకోనున్న‌ట్టు తెలిసింది.
rashmi
చాలా కాలంగా ర‌ష్మి యాంక‌రింగ్ చేస్తున్న నేప‌థ్యంలో జ‌నాల‌కు బోర్ కొట్టేసిందని, దీంతో ఆమెను మార్చాల‌ని మ‌ల్లెమాల టీఎం ఎప్ప‌టి నుంచో ఆలోచిస్తున్న‌ద‌ట‌. అయితే ర‌ష్మి స్థానంలో ఎవ‌ర్ని తీసుకురావాలా..? అని ఇన్ని రోజులు ఆ టీం ఆలోచిస్తూ వ‌చ్చింది. కానీ ఈ మ‌ధ్యే ఆ ఆలోచ‌న‌ల‌కు ఫుల్ స్టాప్ పెట్టేసి బిగ్ బాస్ షో ద్వారా పాపుల‌ర్ అయిన హ‌రితేజ‌ను యాంక‌ర్‌గా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌కు తీసుకోవాల‌ని చూస్తున్న‌ద‌ట‌. బిగ్‌బాస్ షో ద్వారా కోట్ల మంది అభిమానుల‌ను హ‌రితేజ సంపాదించుకోవ‌డంతో ఆమె పాపులారిటీ ఈ కామెడీ షోకు కూడా ప‌నికొస్తుంద‌ని మ‌ల్లెమాల టీం ఆలోచిస్తున్న‌ద‌ట‌. దీంతోపాటు యాక్టింగ్‌, సింగింగ్, డ్యాన్స్ వంటి అంశాల్లో మ‌ల్టీ టాలెంటెడ్‌గా ఉన్న హ‌రితేజ ఈ షోకు ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంద‌ని, స్వ‌త‌హాగా చాలా ఫ‌న్నీగా, అంద‌రినీ న‌వ్విస్తూ ఉండే హ‌రితేజ అయితే షోకు ఇంకా మంచి పేరు వ‌స్తుంద‌ని మ‌ల్లెమాల టీం భావిస్తున్న‌ద‌ట‌. ఈ క్ర‌మంలోనే వారు హ‌రితేజ‌ను సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి ఈ వార్తలు నిజ‌మ‌వుతాయా, కాదా వేచి చూస్తే తెలుస్తుంది..!

7436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS