సినిమాలు మానేస్తాన్న డీజే డైరెక్ట‌ర్ ..!

Thu,July 6, 2017 12:39 PM
harish shankar warns to criticized persons

గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో త‌న‌లోని సత్తా నిరూపించుకున్న స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ . రీసెంట్ గా అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమాకి మిక్స్ డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి క‌లెక్ష‌న్స్ లో మాత్రం బుల్లెట్ లా దూసుకెళుతుంది. ఇటీవ‌ల ఈ చిత్రం వంద కోట్ల కలెక్ష‌న్స్ లోకి ఎంట‌రైంద‌ని ద‌ర్శ‌కుడు తెలియ‌జేశాడు. ఇక తాజాగా ఏరియా వైజ్ లిస్ట్ ని పీఆర్ ఓ వంశీ కాకా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. అయితే దీనిపై కొన్ని వైబ్ సైట్స్ త‌ప్పుడు వార్త‌ల‌తో విమ‌ర్శ‌లు గుప్పించే ప్ర‌య‌త్నం చేశాయి. ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న హ‌రీష్ శంక‌ర్ వారి కి ఛాలెంజ్ విసిరాడు. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రం నైజాం వ్యాప్తంగా మొదటి 13 రోజులు కలిపి రూ. 20 కోట్ల పైనే వసూలు చేసింది. ఇది బన్నీకి నైజాంలో మొదటి రూ. 20 కోట్ల సినిమా కాగా హరీష్ శంకర్ కు రెండవది. ఈ లెక్క‌ల‌ని ఎవ‌రైన ఫేక్ అని నిరూపిస్తే నేను సినిమాలు చేయ‌డం మానేస్తాన‌ని హ‌రీష్ శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు . త‌మ కాస్ట్ అండ్ క్రూని త‌ప్పుడు ఆర్టిక‌ల్స్ తో అవ‌మాన‌ప‌ర‌చ‌డం వ‌ల‌నే ఇలా ట్వీట్ చేశాన‌ని చిన్న వివ‌ర‌ణ కూడా ఇచ్చాడు హ‌రీష్ .

2746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles