ఎఫ్‌2పై హ‌రీష్ శంక‌ర్ ట్వీట్

Sat,January 12, 2019 08:54 AM
harish shankar tweets on f

తెలుగు రాష్ట్రాల‌లో సంక్రాంతి సంద‌డి థియేటర్స్‌లో క‌నిపిస్తుంది. సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన‌ ‘యన్.టి.ఆర్. కథానాయకుడు’, ‘పేట’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలు ఇప్ప‌టికే బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుండ‌గా, మ‌రో చిత్రం ఎఫ్ 2 నేడు గ్రాండ్ గా విడుద‌ల కాబోతుంది. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఎఫ్ 2లో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. వారి స‌ర‌స‌న త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంపై ట్విట్ట‌ర్ లో పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కూడా ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించాడు. అంత‌టా ఎఫ్ 2కి పాజిటివ్ టాక్ వ‌స్తుంది. అనీల్‌, వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌కి శుభాకాంక్ష‌లు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌ అకౌంట్‌లో మరో బ్లాక్‌బస్టర్’ అంటూ హ‌రీష్‌ ట్వీట్ చేశారు. ‘ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌’ హ్యాట్రిక్ విజ‌యాల త‌ర్వాత అనిల్ రావిపూడి మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకోవ‌డం విశేషం. పూర్తిస్థాయి కామెడీ కథాంశంతో ఎఫ్ 2 చిత్రం రూపొందిన సంగ‌తి తెలిసిందే.



2711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles