సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మ‌డు ఎవ‌రో తెలుసా ?

Sat,July 27, 2019 09:10 AM
Harish Shankar tweets about item beauty

గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హ‌రీష్ శంక‌ర్ ప్ర‌స్తుతం వాల్మీకి అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ తేజ్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం కోలీవుడ్ సూప‌ర్ హిట్ జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా తెర‌కెక్కుతుంది. మాస్ ప్రేక్ష‌కుల‌కి ఈ చిత్రాన్ని మ‌రింత ద‌గ్గ‌ర‌గా చేర్చేందుకు ఇందులో ఒక ఐట‌మ్ సాంగ్‌ని కూడా పెడుతున్నారు. ఈ ఐట‌మ్ సాంగ్‌లో డింపుల్ హ‌యాతి అనే తెలుగ‌మ్మాయి త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌నుంద‌ట‌. ఈ అమ్మాయి ప్రభుదేవ, తమన్నాలు నటించిన ‘దేవి-2’లో కీల‌క పాత్ర పోషించింది. తాజాగా హ‌రీష్ శంక‌ర్ ఈ అమ్మాయిని ప‌ల్లెటూరి గెట‌ప్‌లోకి మార్చి వెనుక నుండి తీసిన ఫోటోని షేర్ చేశాడు. సెట్స్‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మాయి ఎవ‌రో చెప్పుకోండి అని కామెంట్ పెట్టాడు. నెటిజన్స్ కొంద‌రు పూజా హెగ్డే అని కామెంట్స్ పెడుతుండ‌గా, మ‌రి కొంద‌రు డింపుల్ హ‌యాతి అని ట్వీట్స్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

3990
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles