మరోసారి రీమేక్‌నే న‌మ్ముకున్న ప‌వ‌న్ డైరెక్ట‌ర్

Thu,November 15, 2018 11:17 AM
Harish Shankar ready to remake kollywood movie

హ‌రీష్ శంక‌ర్.. ఈ పేరు గ‌బ్బ‌ర్ సింగ్ మూవీ త‌ర్వాత జ‌నాళ్ళ నోళ్ళ‌ల‌లో ఎక్కువ‌గా నానింది. హిందీ చిత్రం ద‌బాంగ్‌ని తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కించాడు. ఈ సినిమా ఆయ‌న కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్.. స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన అవి అంత ఆద‌ర‌ణ‌కి నోచుకోలేక‌పోయాయి. అయితే ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ్రా సినిమాని తెలుగులో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ట‌. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. చిత్ర తారాగ‌ణం, సాంకేతిక నిపుణులు త‌దిత‌ర వివరాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌. జిగ‌ర్తాండ్రా చిత్రం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

1086
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles