ఏడాదిన్న‌ర త‌ర్వాత మూవీ ఓకే చేసిన‌ ప‌వ‌న్ ద‌ర్శ‌కుడు

Sat,November 24, 2018 08:30 AM
Harish Shankar make a movie after an year

ప‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో గ‌బ్బ‌ర్ సింగ్ మూవీ తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంకర్. హిందీ చిత్రం ద‌బాంగ్‌ని తెలుగులో గ‌బ్బ‌ర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మంచి విజ‌యం సాధించాడు. ఈ సినిమా ఆయ‌న కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్.. స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన అవి అంత ఆద‌ర‌ణ‌కి నోచుకోలేక‌పోయాయి. చివ‌రిగా అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో డీజే అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు హ‌రీష్ శంక‌ర్‌. ఈ సినిమా విడుద‌లై ఏడాదిన్న‌ర కావొస్తున్న త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ్రా సినిమాని తెలుగులో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు రాగా, ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ట‌. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. చిత్ర తారాగ‌ణం, సాంకేతిక నిపుణులు త‌దిత‌ర వివరాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌. జిగ‌ర్తాండ్రా చిత్రం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. త‌మిళ రీమేక్ చిత్రంలో హీరోగా వరుణ్‌ తేజ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.చూడాలి మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో !

2409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles