‘వాల్మీకి’ హీరోయిన్ ను ఎంపిక చేసిన దర్శకుడు

Mon,April 1, 2019 04:21 PM
Harish Shankar finalised Heroine for Valmiki?

వరుణ్‌తేజ్, హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో ‘వాల్మీకి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళంలో హిట్‌గా నిలిచిన జిగర్తాండ సినిమాకు ఇది రీమేక్. వాల్మీకి చిత్రంలో వరుణ్‌తేజ్‌కు జోడీగా నటించే హీరోయిన్‌ను దర్శకుడు హరీష్‌శంకర్ ఫైనల్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. సూపర్ డీలక్స్ చిత్రంతో తమిళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాళిని రవిని వాల్మీకిలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. డైరెక్టర్ అండ్ టీం ఇప్పటికే హీరోయిన్ లుక్ టెస్ట్, ఫొటోషూట్ కూడా పూర్తిచేశారట.

తమిళ మాతృకలో లక్ష్మీమీనన్ పోషించిన పాత్రకు మృణాళిని అయితే బాగుంటుందని భావించిన టీం ఆమెను ఓకే చేసినట్లు టాక్. త్వరలో ఈ విషయాన్ని హరీష్ శంకర్ అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ చిత్రంతో తమిళ నటుడు అథర్వ మురళి తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. గ్యాంగ్‌స్టర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న వాల్మీకి ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది.

1825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles