స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు: హ‌రీష్ శంక‌ర్

Sat,September 21, 2019 09:29 AM

గ‌బ్బ‌ర్ సింగ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన హ‌రీష్ శంక‌ర్, ఈ సినిమా త‌ర్వాత మ‌రో మంచి విజ‌యాన్ని రుచి చూడ‌క చాలా రోజుల‌యింది. మ‌ళ్ళీ మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న హ‌రీష్ స‌క్సెస్ సాధించాడు. వాల్మీకి అనే టైటిల్‌తో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కించగా, ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 20న విడుద‌లైంది. అయితే వాల్మీకి చిత్ర టైటిల్ విష‌యంలో కొన్నాళ్ళుగా అనేక స‌మ‌స్య‌ల‌ని ఎదుర్కొంది చిత్ర బృందం. ముందుగా వాల్మీకి టైటిల్‌కి గ‌న్ ఉండడంతో దానిపై ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో గ‌న్ సింబ‌ల్ తొల‌గించారు. త‌ర్వాత వాల్మీకి టైటిల్‌ని మార్చాల‌ని హైకోర్టులో పిటీష‌న్ వేసింది బోయ హ‌క్కుల పోరాట స‌మితి.


సినిమా రిలీజ్‌కి ముందుకు హైకోర్ట్ నుండి నోటీసులు రావ‌డంతో చివ‌రి క్ష‌ణంలో వాల్మీకి అనే చిత్ర టైటిల్‌ని గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ అని మార్చారు. అప్ప‌టి వ‌ర‌కు వాల్మీకిగా ప్ర‌చారం జ‌రుపుకున్న చిత్ర టైటిల్ రిలీజ్‌కి ముందు రోజు మారడంతో చిత్ర యూనిట్ తెగ ఆందోళ‌న చెందారు. సినిమా క‌లెక్ష‌న్స్‌కి ఏమైన ఎఫెక్ట్ ప‌డుతుందా అని ఆలోచ‌న చేశారు. కాని సినిమాకి వ‌స్తున్న టాక్ చూసి మేక‌ర్స్ చాలా సంతోషించారు. మీడియా స‌పోర్ట్‌, త‌న మిత్రులు, శ్రేయోభిలాషుల అండ‌దండ‌ల‌తో సినిమా ఇంత మంచి విజ‌యం సాధించింద‌ని హ‌రీష్ ట్వీట్ చేశారు. సినిమా చూసిన వారితో పాటు మ‌మ్మ‌ల్ని స‌పోర్ట్ చేసి ప్ర‌తి ఒక్క‌రికి అలానే ప్రింట్ మీడియా, వెబ్ మీడియా, ఎల‌క్ట్రానిక్ మీడియా ఇచ్చిన విలువైన రివ్యూస్ మాకు చాలా ప్రేర‌ణ ఇచ్చాయి అని హ‌రీష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. మాకు జరిగిన ఇబ్బంది కలగకపోయి ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్‌ చేసేవాళ్ళం. మా సినిమాకి ఇంత ప్రేమ వస్తుంది అని మేము అనుకోలేదు. ఎవరు ఓడిపోయారో నాకు తెలీదు కానీ సినిమా మాత్రం గెలిచింది అని ప్రెస్‌మీట్‌లో స్ప‌ష్టం చేశారు ద‌ర్శ‌కుడు హ‌రీష్ .1475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles