పుకార్లని కొట్టిపారేసిన హ‌రీష్ శంక‌ర్

Sat,May 4, 2019 08:48 AM
Harish Shankar denies the rumors of valmiki

గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో వాల్మీకి అనే చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మిళంలో హిట్ అయిన జిగ‌ర్తాండ్రా మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో క‌థానాయిక‌గా పూజా హెగ్డే న‌టిస్తుంది. అయితే ఈ చిత్రం కోసం పూజా భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీనిని కొట్టిపారేశాడు హ‌రీష్‌. అలానే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో హరీష్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు, ఇటీవ‌ల ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప‌వ‌న్‌తో డిస్క‌ష‌న్స్ కూడా జ‌రిపాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీంట్లోను ఎలాంటి నిజం లేద‌ని హ‌రీష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. సినిమా ల‌వర్స్ ఇలాంటి రూమ‌ర్స్ అస్స‌లు ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, త‌న నుండి కాని లేదంటే ప్రొడ‌క్ష‌న్ హౌజ్ నుండి ఏదైన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌స్తేనే న‌మ్మాలని కోరాడు. వాల్మీకి చిత్రంతో తమిళ నటుడు అథర్వ మురళి తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. గ్యాంగ్‌స్టర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న వాల్మీకి ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది.1879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles