పదాలు తొలగించే సినిమా రిలీజ్ చేస్తాం: హరీష్‌ శంకర్

Wed,June 14, 2017 01:01 PM
harish shankar clarity on duvvada issue

దువ్వాడ జగన్నాథం చిత్రంలోని గుడిలో బడిలో మడిలో అనే పాట వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ పాటలోని సాహిత్యం బ్రాహ్మణులని అవమాన పరిచే విధంగా ఉందని, సాహితి రాసిన ‘నమకం.. చమకం’ , ‘అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం’ అనే పదాలు రుద్ర స్తోత్రాన్ని అవమానించేవిగా ఉన్నాయని, వాటిని తొలగించాలని బ్రాహ్మణులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బ్రాహ్మణ అసోసియేషన్ సభ్యులు హరీష్‌ శంకర్ ని కలిసి చర్చలు కూడా జరిపారు. హరీష్‌ కూడా పదాలు మార్చి పాట విడుదలచేస్తామని అన్నాడు. అయితే మొన్న జరిగిన ఆడియో వేడుకలో పదాలు మార్చకుండా పాట విడుదల చేయడంతో మళ్ళీ ఫైర్ అయ్యారు బ్రాహ్మ‌ణ సంఘాలు. దీనిపై హరీష్‌ శంకర్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విదేశాలలో పలు కన్సర్ట్స్ తో బిజీగా ఉన్నందున ఆడియో వేడుకలో పాత సాంగ్ నే రిపీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే ఈ పాట విషయమై సెన్సార్‌ బోర్డ్‌ వారితో చర్చించి పాటలోని రెండు పదాలను మార్చనున్నట్లు తెలిపాం. దేవిశ్రీ ప్రసాద్‌ ఇండియాకు రాగానే ఆ పదాలను తొలగించి కొత్త పదాలను జోడిస్తాం. దీనిపై బ్రాహ్మణ సంఘాలవారు ఎలాంటి సందేహాలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరి మనోభావాలనూ మేం గౌరవిస్తాం అంటూ హరీష్‌ శంకర్ వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదం సమసిపోయినట్టేనని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

2490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles