డీజే సాంగ్ లోని పల్లవినే టైటిల్ గా ఫిక్స్ చేసిన హరీష్ శంకర్

Thu,February 22, 2018 03:57 PM
Harish Shankar another project gets the title

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ చిత్రంతో అందరి దృష్టి ఆకర్షించిన డైరెక్టర్ హరీష్ శంకర్. రీసెంట్ గా బన్నీతో దువ్వాడ జగన్నాథమ్ అనే చిత్రాన్ని తీసాడు. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికి, కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే హరీష్ శంకర్ తదుపరి సినిమాలకి సంబంధించి కొద్ది రోజులుగా ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. నితిన్- శర్వానంద్ కాంబినేషన్ లో దాగుడుమూతలు అనే టైటిల్ తో హరీష్ మల్టీ స్టారర్ చేయనున్నాడు అని అంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం కి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత జవాన్ చిత్రాన్ని నిర్మించిన కొమ్మలపాటి క్రిష్ణ నిర్మాణంలో సీటీమార్ అనే సినిమా చేయనున్నాడట హరీష్ శంకర్. దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలోని సీటీమార్ సీటీమార్.. సాంగ్ లోని పల్లవినే సినిమా టైటిల్ గా ఫిక్స్ చేశారు. వరుస హిట్స్ తో మంచి జోరుమీదున్న యువ కథానాయకుడు నాని ఈ మూవీలో హీరోగా నటించనున్నాడని తెలుస్తుండగా, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు.

1667
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles