హరికృష్ణకు డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టం..

Wed,August 29, 2018 08:12 PM
harikrishna likes Driving says raghavendrarao

హైదరాబాద్: నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్న వార్తను తాను నమ్మలేకపోతున్నానని సినీ దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. హరికృష్ణ కుటుంబసభ్యులతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. హరికృష్ణకు డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టమని రాఘవేంద్రరావు అన్నారు. ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ విజయానికి హరికృష్ణ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఎన్టీఆర్ వాహనానికి రథసారథిగా వేల కిలోమీటర్లు వాహనాన్ని నడిపిన ఆయన..సొంతంగా కారు నడుపుతూ ప్రమాదానికి గురవ్వడం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. హరికృష్ణ తనను ఎప్పుడూ అన్నయ్య అన్నయ్యా అని ఆత్మీయంగా పిలిచేవారని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు. తాను తెరకెక్కించిన డ్రైవర్ రాముడు సినిమాకు నిర్మాతగా వ్యవహరించినట్లు తెలిపారు.

8604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles