హ‌రికృష్ణ జ‌యంతి నేడు

Sun,September 2, 2018 09:09 AM
hari krishna jayanthi

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం నంద‌మూరి తార‌క‌రామారావు పెద్ద కుమారుడు హ‌రికృష్ణ ఆగ‌స్ట్ 29 ఉద‌యం 6గంట‌ల స‌మ‌యంలో కారు ప్ర‌మాదంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ నుండి నెల్లూరు జిల్లాలోని కావ‌లిలో వివాహ వేడుకకు హాజ‌ర‌య్యేందుకు హరికృష్ణ AP28 BW 2323 నంబర్‌ ఫార్చ్యూనర్ వాహనంలో అతి వేగంగా వెళుతుండ‌గా ఈ ప్రమాదం జరిగింది. హ‌రికృష్ణ మృతితో యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ‌తో పాటు తెలుగు దేశం కార్య‌క‌ర్త‌లు దిగ్భ్రాంతి చెందారు. మ‌రో నాలుగు రోజుల‌లో ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వేడుక‌ల‌కి ప్లాన్ చేస్తున్న అభిమానుల‌కి ఆ వార్త షాకింగ్‌గా మారింది. ఆయ‌న మ‌ర‌ణించార‌న్న వార్త‌ని ఇప్ప‌టికి వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

సెప్టెంబ‌ర్ 2, 1956లో జ‌న్మించారు హ‌రికృష్ణ‌. ఆయన బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని అభిమానులు, తెలుగు దేశం కార్య‌కర్త‌లు భావించారు. ఈ విష‌యం తెలుసుకున్న హ‌రికృష్ణ త‌న అభిమానుల‌ని ఉద్దేశించి లేఖ రాశారు. సెప్టెంబర్‌ 2 నా అరవై రెండవ పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరుపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా ఎంతో మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులైనారు.

ఇది మన అందరికి ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. అందుచేత నా జన్మదిన సందర్భంగా బేనరులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గచ్ఛాలు, దండలు తీసుకు రావద్దని వాటికి అయ్యే ఖర్చుని వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను’ అంటూ ఓ పత్రికా ప్రకటనను సిద్ధం చేశారు. ఈ ప్రకటన వెలువడకకుందే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పుట్టిన రోజున త‌న తండ్రి త‌మ‌తో లేర‌ని తెలిసి ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌లు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

6949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles