సీతయ్య సినీ ప్ర‌స్థానం

Wed,August 29, 2018 11:19 AM
hari krishna cine career

ఇటు సినిమాలు, అటు రాజ‌కీయాల‌లో త‌న‌కంటూ ప‌త్యేక స్థానం సంపాదించుకున్న హ‌రికృష్ణ ద‌శాబ్ధ కాలం నుండి పూర్తిగా రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. శ్రీ‌కృష్ణావ‌తారం చిత్రంలో బాల‌కృష్ణుడి పాత్ర‌తో బాల‌న‌టుడిగా సినీ రంగంలో ప్ర‌వేశించారు. 1970లో త‌ల్లా పెళ్ళామా చిత్రంలో సైతం బాల‌న‌టుడిగా న‌టించారు. 1974లో తాత‌మ్మ‌క‌ల సినిమాతో పూర్తిస్థాయి న‌టుడిగా మారారు. ఆ త‌ర్వాత 1998లో శ్రీ‌రాముల‌య్య సినిమాలో స‌త్యం పాత్ర‌లో జీవించేశారు. 1999 సంవ‌త్స‌రంలో ఆయ‌న న‌టించిన సీతారామ‌రాజు చిత్రం ఆయ‌న‌ని జ‌నాల‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌గా చేసింది.

2002లో లాహిరి లాహిరి లాహిరిలో త‌న న‌ట‌నా ప్ర‌తిభ‌ను మ‌రింత వెలికితీశారు. అదే సంవ‌త్స‌రంలో శివ‌రామ‌రాజులో న‌టించారు. 2003 సంవ‌త్స‌రంలో సీత‌య్య సినిమాలో ఆయ‌న చేసిన సీత‌య్య పాత్ర ప్ర‌తి తెలుగువాడికి గుర్తుంటుంది. అదే ఏడాది టైగ‌ర్ హరిశ్చంద్ర‌ప్ర‌సాద్ సినిమాలో సైతం న‌టించారు. ఆ త‌ర్వాత నుంచి సినిమాల్లో నెమ్మ‌దించ‌డం మొద‌లైంది. చివ‌ర‌గా 2004లో స్వామి, 2005 సంవ‌త్స‌రంలో శ్రావ‌ణ‌మాసం త‌ర్వాత సినిమాల నుంచి దాదాపుగా వైదొల‌గారు. అయితే హ‌రికృష్ణ న‌టుడిగానే కాదు ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటారు. హ‌రికృష్ణ దాన‌వీర శూర‌క‌ర్ణ అనే చిత్రాన్ని నిర్మించాడు.

రాజ‌కీయాల‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ హరికృష్ణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడయ్యాడు. ఆ పార్టీ తరపున ఒకసారి రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యాడు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ రాజీనామా చేశాడు. తన రాజ్యసభ సభ్యత్వానికి (22/08/2013) రాజీనామా సమర్పించారు. సినిమాల‌తో జనాల‌కి చాలా ద‌గ్గ‌రైన హ‌రికృష్ణ దుర్మ‌ర‌ణం చెంద‌డం సినీ ప‌రిశ్ర‌మ‌ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుంది

3055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles