సెట్స్ పైకి వెళ్ళిన రెజీనా కొత్త చిత్రం

Fri,May 19, 2017 04:39 PM
సెట్స్ పైకి వెళ్ళిన రెజీనా కొత్త చిత్రం

ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలలో నటించి మెప్పించిన రెజీనాకి ఇప్పుడు తెలుగు లో ఆఫర్లు కరువయ్యాయి. తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికి జ్యో అచ్యుతానంద చిత్రం తర్వాత రెజీనా మరో తెలుగు సినిమా చేయకపోవడం విశేషం .. అయితే సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై అర్జున్‌సాయి తెరెకెక్కించనున్న చిత్రంలో రెజీనా కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లగా, శామిర్ పేట‌లోని ఆల‌యంలో కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. మ‌రో ప‌ది రోజుల పాటు ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. దిలీప్‌ ప్రకాష్‌ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి `హ‌రే రామ హ‌రే కృష్ణ‌` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఏక‌కాలంలో రూపొంద‌తున్న ఈ చిత్రంలో సంప్రదాయ కళలను కాపాడటానికి ప్రయత్నించే యువతి పాత్రలో రెజీనా నటిస్తుండగా, ఈమెకి తల్లిగా సీనియర్ హీరోయిన్ ఆమని నటించనుందట.

813
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS