'హ్యాపి వెడ్డింగ్' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Sat,June 30, 2018 11:07 AM
Happy Wedding Theatrical Trailer released

సుమంత్ అశ్విన్, నిహారిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో డెబ్యూ డైరెక్ట‌ర్‌ ల‌క్ష్మ‌ణ్ క‌ర్య తెర‌కెక్కిస్తున్న చిత్రం హ్యాపి వెడ్డింగ్‌. జూలైలో విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో పాల లాంటిది మా హ‌ర్ష‌.. కాఫీ చేసుకోవ‌చ్చు, కాంప్లైన్ చేసుకోవ‌చ్చు.. మ‌రి మా మ‌న‌వ‌డితో కాపురం చేసుకోవ‌చ్చా అండి అనే డైలాగ్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు . థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ ఊపందుకున్నాయి. మేకింగ్ వీడియోస్‌, సాంగ్స్‌, టీజ‌ర్‌తో అల‌రించిన టీం ఇప్పుడు ట్రైల‌ర్‌తో సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచింది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు చూడండి.

1611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles