నా పెళ్లి గురించి మీకెందుకు: నిహారిక‌

Thu,June 28, 2018 11:14 AM
Happy Wedding Promotional Video

మెగా హీరోయిన్‌గా ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర‌కు ఎంట్రీ ఇచ్చిన నిహారిక ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో దూసుకెళుతుంది. ఆమె నటించిన హ్యాపీ వెడ్డింగ్ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో సినిమాపై జ‌నాల‌లో ఆస‌క్తి క‌లిగించేలా వెరైటీ ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో నిహారికని ఓ వ్యక్తి మీ వెడ్డింగ్ గురించి వార్త‌ ఓ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీనిపై ఏమంటారు అని అడ‌గ‌గా, నా పెళ్లి గురించి మీ కెందుకు అని ఫైర్ అవుతుంది. నేన‌డిగింది హ్యాపీ వెడ్డింగ్ గురించి అని స‌ద‌రు వ్య‌క్తి చెప్ప‌గానే, కొంచెం కూల్ అయిన నిహారిక‌ త‌న తాజా చిత్ర ట్రైలర్ జూన్ 30 ఉద‌యం 10.35ని.ల‌కు విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేసింది. అయితే ఈ వీడియో సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగానే చేసిన‌ట్టు తెలుస్తుంది.

సుమంత్ అశ్విన్‌, నిహారిక హీరో హీరోయిన్స్‌గా తెర‌కెక్కిన హ్య‌పీ వెడ్డింగ్ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు . థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క‌ అల‌రిస్తుందని అంటున్నారు. ఇక నిహారిక.. నూత‌న ద‌ర్శ‌కురాలు సుజ‌నా తెర‌కెక్కించ‌నున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోను న‌టిస్తుంది. ఇందులో శ్రియాతో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ప్ర‌ణీత్ బ్ర‌హ్మండ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేయ‌నుంది . ఇందులో రాహుల్ విజ‌య్ క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు.

5906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles