నిహారిక 'హ్యాపీ వెడ్డింగ్' ఫ‌స్ట్ ఇన్విటేష‌న్ వ‌చ్చేసింది

Thu,June 21, 2018 09:15 AM
Happy Wedding First Invitation

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు గారాల ప‌ట్టి నిహారిక ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి చిత్రంతో ఆక‌ట్టుకున్న ఈ అమ్మ‌డు మెగా హీరోయిన్‌గా అభిమానుల మ‌న‌సులు దోచుకుంది. ఇటీవ‌ల‌ నిహారిక హ్య‌పీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది. ల‌క్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, నిహారిక హీరో హీరోయిన్స్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు . థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. హ్యాపీ వెడ్డింగ్ ఫ‌స్ట్ ఇన్విటేష‌న్ అంటూ విడుద‌లైన వీడియో అభిమానుల‌ని అల‌రిస్తుంది. చిత్ర ట్రైల‌ర్ జూన్ 30 ఉద‌యం 10.36ని.ల‌కి విడుద‌ల కానుంది. మూవీ రిలీజ్ డేట్ కూడా అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది చిత్ర యూనిట్‌.

2251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles