హ్యపీ బర్త్ డే టూ విక్రమ్

Sun,April 17, 2016 09:40 AM
happy birthday to vikram

కొందరు నటులు విభిన్న పాత్రలు ధరించడమే కాదు...విభిన్న రంగాల్లో కూడా తమ ముద్ర వేసుకుంటారు. వారిది విలక్షణమైన, విభిన్నమైన రీతి. అలాంటి భిన్నత్వం, భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న నటుడు విక్రం. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన విక్రం జాతీయ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నాడు.

1966లో పుట్టిన విక్రం పూర్తి పేరు కెన్నేడీ జాన్ విక్టర్. విక్రం మూవీ కెరీర్ 1990లో తమిళ సినిమా ఏక్ కాదల్ కన్మణి చిత్రంతో స్టార్ట్ అయింది. ఉల్లాసం, జెమిని సినిమాలు అతనికి మంచి పేరు తెచ్చాయి. తెలుగులో విక్రం 1993లో చిరునవ్వుల వరమిస్తావా లో మొదటిసారి కనిపించాడు. ఆ తర్వాత బంగారు కుటుంబం, ఆడాళ్లా మజాకా, ఊహ, మెరుపు, కుర్రాళ్ల రాజ్యం, 9 నెలలు, యూత్ సినిమాల్లో చేశాడు.

తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంవత్సరంలోనే విక్రం మలయాళ మూవీ ధ్రువ విడుదలైంది. మయూర నృత్యం అతనికి మంచి పేరు తెచ్చింది. విక్రం అప్పట్లో హుషారైన కేరక్టర్స్ వేసినా తర్వాత విడాకులు తీసుకున్న భర్తగా, లవర్ గా మారిన పోకిరి కుర్రాడిగా, పరోపకారం చేసే రాబిన్ హుడ్ వంటి సీరియస్ రోల్స్ కూడా వేశాడు. ఇతను గ్లామర్ కేరక్టర్స్ తక్కువగానే చేశాడు. విక్రం నటనకే పరిమితం కాలేదు. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు.

విక్రం జీవితంలో మరచిపోలేని ఘట్టం...గాంధీ సినిమాలో బెన్ కింగ్ స్లేకి డబ్బింగ్ చెప్పడం. అలాగే సత్య సినిమాలో జెడీ చక్రవర్తికి కూడా డబ్బింగ్ చెప్పాడు. విక్రం యూడ్స్ లోనూ, మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా కనిపించాడు. ప్రముఖ కంపెనీల పాపులర్ ప్రకటనల వీడియోలు, హోర్డింగ్స్ ప్రకటనల్లో విక్రం కనిపిస్తాడు. దేశాన్ని దేశభక్తిలో ముంచెత్తిన చాలా జనాదరణ పొందిన ...ఫిర్ మిలే సుర్ మేరా తుమారా పాటలో విక్రం కూడా ఉండడం విశేషం.

వివిధ రంగాల్లో రాణిస్తున్న విక్రంకు జాతీయ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కూడా వచ్చాయి. పీపుల్స్ యూనివర్సటీ ఆఫ్ మిలన్ 2011లో విక్రం కు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. మరి ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న విక్రమ్కు యన తరపున స్పెషల్ విషెస్ తెలియజేద్ధాం.

2030
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles