విరబూసిన సుమహాసిని సుహాసినికి బ‌ర్త్ డే విషెస్

Tue,August 15, 2017 09:47 AM
happy birthday to Suhasini Maniratnam

విరబూసిన సుమహాసిని సుహాసిని నిజంగా సుహాసినే. నవ్వు ఆమెకు ఒక వరం. ఆ నవ్వులో చల్లని వెన్నెల ఉంది. కెమెరా ఉమన్ అవుదామని సినీఫీల్డ్ కొచ్చిన సుహాసిని ప్రేక్షకుల అదృష్టం కొద్దీ అనుకోకుండా నటి అయింది. సుహాసినిని చూస్తే అచ్చం మన ఇంట్లో అమ్మాయిలో అనిపిస్తుంది. ఆనాడు అగ్రహీరోలందరితో నటించిన సుహాసిని ఎక్కువగా నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ వేసింది. ఈ నటహాసిని నేడు 55వ ప‌డిలోకి అడుగుపెట్టింది.

నట కుటుంబం నుంచి వచ్చిన సుహాసిని నటనకు ప్రాధాన్యమున్న ఎన్నో కేరక్టర్స్ వేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఆనాటి అగ్రహీరోలందరితో నటించింది. అప్పటి హీరోయిన్ సుహాసిని గ్లామర్ పాత్రలకన్నా నటనకు స్కోప్ ఉండే కేరక్టర్స్ నే లైక్ చేసింది. సిరివెన్నెల చిత్రంలో పాత్ర సుహాసిని కెరీర్ లోనే బెస్ట్ రోల్ అనవచ్చు. ఆ సినిమాలో మూగమ్మాయిగా నటించిన సుహాసినికి నూటికి నూరు మార్కులు పడ్డాయి. సిరివెన్నెల కాదు, సినీవెన్నెల అన్నారు ఆమెను.


కెరీర్ బిగినింగ్ రోజుల్లో సుహాసిని నటించిన మంగమ్మగారి మనవడు పెద్ద హిట్. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా లో పల్లెటూరి యువతిగా వేసిన సుహాసిని అచ్చం అలాగే కనిపించింది. ఆ సినిమాలో శ్రీ సూర్యనారాయణా పాట ఇప్పటికీ చాలామందికి గుర్తుంది. సుహాసిని సీరియస్ పాత్రలే కాదు, చంటబ్బాయి వంటి సినిమాల్లో కామెడీగా కూడా నటించింది.

తను ఏ హీరోతో నటించినా అతనితో పోటీపడి నటించడం సుహాసిని ప్రత్యేకత అనాలి. మంచుపల్లకి, సంసారం ఒక చదరంగం వంటి మంచి సినిమాల్లో యాక్ట్ చేసిన సుహాసిని ఛాలెంజ్, బుల్లెట్, మగమహారాజు, మరణమృదంగం, రాక్షసుడు, ఆఖరిపోరాటం వంటి కమర్షియల్ సినిమాలూ చేసింది. తెలుగులో ఎన్నో మంచి పాత్రల్లో నటిస్తూ, ఆడియన్స్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుహాసిని మరెన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని కోరుకుందాం.

1352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles