రాక్ స్టార్ మంచు మనోజ్ కి బర్త్ డే విషెస్

Sat,May 20, 2017 09:34 AM
happy birthday to rocking star manoj

రాక్ స్టార్ మంచు మనోజ్ కుమార్ తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచి నటుడు అన్న సంగతి తెలిసిందే. ఆ లక్షణాలే మనోజ్ కు కూడా వచ్చాయి. బాల్యం నుంచే నటన పట్ల ఆసక్తి అలవరచుకున్న మంచు మనోజ్ కుమార్ బాలనటుడిగా మూవీల్లోకి వచ్చి … ఆ తర్వాత హీరో అయి తన స్టామినా చూపాడు. ఈ రోజు మనోజ్ బర్త్ డే. ఆ సందర్భంగా ‘ఒక్కడు మిగిలాడు’ చిత్ర యూనిట్ సెకండ్ లుక్ విడుదల చేసింది.

మంచు మనోజ్ కుమార్ స్పెషాలిటీ ఏంటంటే పదో ఏటనే సినిమాల్లోకి ఎంటరయ్యాడు. తండ్రి మోహన్ బాబు తీసిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో బాలనటుడిగా నటజీవితం ప్రారంభించిన మనోజ్ కుమార్ తర్వాత మరో రెండు సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. హీరోగా మనోజ్ మొదటి సినిమా 2004లో వచ్చిన దొంగ దొంగది. మనోజ్ కమర్షియల్ పిక్చర్స్ లోనే కాక, క్లాస్ మూవీలు, సరదాగా సాగిన చిత్రాల్లో కూడా నటించాడు. మనోజ్ నటించిన వాటిల్లో బిందాస్ పెద్ద హిట్. అతనికి స్పెషల్ జ్యూరీ నంది అవార్డు కూడా వచ్చింది. రాజుభాయ్, పోటుగాడు చిత్రాలు కమర్షియల్ సక్సెస్ లు ఇచ్చాయి.

మంచు మనోజ్ పిక్చర్లలో నేను మీకు తెలుసా? మ్యూజికల్ హిట్. ఇక వేదం, ప్రయాణం, ఝమ్మంది నాదం క్లాస్ పిక్చర్స్. అతని నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇక ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? పాండవులు పాండవులు తుమ్మెదా సరదాగా సాగాయి. కరెంట్ తీగ, గుంటూరోడు చిత్రాలు మనోజ్ కెరియర్ కి మంచి టర్నింగ్ పాయింట్ గా మరాయి.

మనోజ్ ప్రస్తుతం ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో ఎల్.టి.టి. ఈ మిలిటెంట్ చీఫ్ గా, ఒక విద్యార్థిగా నటిస్తున్నాడు. మిలిటెంట్ పాత్ర కోసం బరువు పెరిగిన మనోజ్ విద్యార్థి పాత్ర కోసం 15 కిలోల బరువు తగ్గాడు. నిజ జీవిత సంఘటనలకి అద్దం పట్టే కథ, కథనాలతో ఈచిత్రం తెరకెక్కగా ఇందులో మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్ కథాయికగా నటిస్తోంది .అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

మంచు మనోజ్ కెరియర్ లో గుర్తుండిపోయే చిత్రంగా ఒక్కడు మిగిలాడు చిత్రం ఉంటుందని అభిమానులు భావిస్తుండగా, రానున్న రోజుల్లో మరిన్ని మంచి సినిమాల్లో నటించి, హిట్స్ ఇవ్వాలని ఆశిస్తూ .అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు

794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS