రజనీకాంత్ కు శుభాకాంక్షల వెల్లువ

Sat,December 12, 2015 03:02 PM
happy birthday to rajini

కేవలం నటుడిగానే కాక సామాజిక చైతన్యం గల వ్యక్తి గా ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. 64 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 65 వ వసంతంలోకి అడుగుపెట్టిన రజనీ ఇప్పటికి ఎంతో నిరాడంబరంగా ఉంటూ అందరి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటు ఉంటారు. ప్రతీ సంవత్పరం ఈయన బర్త్ డే వేడుకలను ఎంతో గ్రాండ్ గా జరిపే అభిమానులు ఈ సారి రజనీ కోరిక మేరకు , ఆ వేడుకలకు దూరంగా ఉన్నారు. చెన్నై వరదల వలన ఎందరో నిరాశ్రయలు కాగా వారి పరిస్థితులను అర్ధం చేసుకున్న రజనీ పది కోట్ల పది లక్షలు విరాళంగా ఇచ్చారు.

రజనీ ఈ సంవత్సరం తన బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నా , ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు గతంలో రజనీతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు . అయితే శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాజమౌళి, బిగ్ బి, బోయపాటి, వెంకటేష్ , అల్లు అర్జున్ , నారా రోహిత్ , సునీల్ , బ్రహ్మజీ, అనుష్క, మంచు లక్ష్మీ, ఎం.ఎం.శ్రీలేఖ, ధనుష్ తదితరులు ఉన్నారు.

1921
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles