ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ వీడియో

Sun,September 2, 2018 07:26 AM
happy birthday to power star pawan kalyan

అతని స్టైల్స్ సూపర్బ్ ..అతని డైలాగ్స్ అదుర్స్. లుక్స్ లో మ్యాజిక్. నడకలో డాన్సింగ్ మూవ్ మెంట్స్. టోటల్ గా ఆడియన్స్ ను ఎలక్ట్రిఫై చేసే స్టార్‌ పవన్ కళ్యాణ్ . అతని పేరు చెప్పగానే యూత్ లో పులకింతలు. సభల్లో పవన్ ను చూడగానే కేరింతలు. ఫ్యాన్స్ ను, ఆడియన్స్ ను మాగ్నిఫై చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ‌ర్త్ డే నేడు. ప‌వన్ కళ్యాణ్ పేరు చెప్పగానే అందరిలో స్వీట్ వైబ్రేషన్స్ అలా మొద‌లు అవుతాయి. కొత్త అల్లుడు అత్తారింటికి దారేదీ అనుకున్నట్టు ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ సినిమా ఆడే థియేటర్ కు దారేదీ అని వెతుక్కుంటారు. ఆ గబ్బర్ సింగ్ ను పదే పదే చూడాలనుకుంటారు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని ఎనౌన్స్ చేసినప్పటి నుంచీ ఫ్యాన్స్ లో, ఆడియన్స్ లో ఓ రకమైన క్రేజ్ క్రియేటవుతుంది.

పవన్ సినిమా ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూసే ఫ్యాన్స్ ఆ మూవీకోసం సంవత్సరమైనా వెయిట్ చేస్తారు. షూటింగ్ స్టార్టయినప్పటి నుంచి… ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని తహతహలాడుతుంటారు. అయితే జనసేన పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఎంటరైన‌ తర్వాత సినిమాల‌కి దూర‌మ‌య్యాడు ప‌వ‌న్‌. చివ‌రిగా అజ్ఞాతవాసి చిత్రంతో అల‌రించాడు ప‌వ‌న్‌. ఆయ‌న సినిమాల‌లోకి వచ్చిన తర్వాత...హీరోయిజంలో స్టైలిష్‌నెస్‌ వచ్చింది. హీరో అంటే ఎప్పుడూ సీరియస్‌గా ఉండాలనే ఈక్వేషన్ మారిపోయింది. హీరో అంటే స్టైల్‌ గా, సరదాగా ఉండాలనే ఒక కొత్త ‌ట్రెండ్‌ పవన్‌తోనే టాలీవుడ్‌లో మొదలైంది. పవన్‌ ప్రతి కదలికలో అతనికే ప్రత్యేకమైన ఆ స్టైల్‌ కనబడుతుంది.

పవన్‌ ఏ కేరక్టర్ పోషించిన‌ ఆ పాత్ర పోషణలో ప్రత్యేకత ఉంటుంది. ఆ కేరక్టర్‌ను జాలీగా, ‌హ్యాపీగా, ఈజీగా, సింపుల్‌గా, నేచురల్‌గా చేస్తాడు. అది అతనికే సొంతం. సినిమాల్లో ఎంతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ప్రజల గురించి, పేదల గురించి ఆలోచిస్తాడు. వారికేదైనా సాయం చేయాలనే తపన ఉంది పవన్ లో. ఎవరికే అన్యాయం జరిగినా సహించడు. వారి తరఫున పోరాడతాడు. అందుకే జనసేన పార్టీ స్థాపించి పొలిటికల్ గా కూడా తన పవర్ చూపిస్తున్నాడు. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన ప‌వ‌న్ ప్రజలకు మరింత సేవ చేసే ఉద్ధేశంతో ముందుకు వెళుతున్నాడు. నేడు ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా జనసేనకు చెందిన శతాగ్ని టీమ్ రూపొందించిన ఓ వీడియో జన సైన్యంలో ఉత్సాహాన్ని నింపుతుంది. సామాన్యుడి నుంచి సామాజిక శాస్త్రవేత్తగా పవన్ చేస్తున్న రాజకీయ ప్రయాణాన్ని ఈ వీడియోలో చూపించారు. మ‌రి మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

8575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles