ఇస్మార్ట్ బ్యూటీకి బ‌ర్త్ డే విషెస్

Wed,December 11, 2019 01:08 PM

పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. ఇందులో నభా న‌టేష్‌, నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌లుగా న‌టించారు. నిధి ప‌ర్‌ఫార్మెన్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రామ్ ల‌వ‌ర్‌గా తెలంగాణ పోరిగా న‌ట విశ్వ‌రూపం చూపించింది. ఈ సినిమాతో నిధికి ప‌లు ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ర‌వితేజ డిస్కోరాజా సినిమాతో పాటు సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న సోలో బ‌తుకే సో బెట‌ర్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 8వ చిత్రంలోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ రోజు న‌భా న‌టేష్ బ‌ర్త్‌డే కావ‌డంతో సినిమాల‌లో ఆమె లుక్స్‌కి సంబంధించిన పోస్ట‌ర్స్ విడుద‌ల‌య్యాయి. మంచి హాట్‌గా క‌నిపిస్తున్న న‌భాని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.అలానే సంతోష్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న మూవీ సెట్‌లో న‌భా బ‌ర్త్‌డే వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. చిత్ర బృందం ఆమెతో కేక్ క‌ట్ చేయించి తినిపించారు. ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న మూడు చిత్రాలు క‌నుక మంచి విజ‌యం సాధిస్తే న‌భా కెరియ‌ర్‌కి తిరుగుఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు.

2026
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles