హ్యాపీ బర్త్ డే జగపతి బాబు

Sun,February 12, 2017 12:08 PM
happy birthday jagapathi babu

జగపతి బాబు పేరు చెప్పగానే అందరికీ ఓ సాఫ్ట్ హీరో ఇమేజ్ గుర్తుకొస్తుంది. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు అసలు పేరు వీరమాచనేని జగపతి చౌదరి. 1962 ఫిబ్రవరి 12న కృష్ణా జిల్లా మచిలీపట్నం లో పుట్టాడు. ప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ అతని ఫాదర్. సినిమాల్లోకి వచ్చాక జగపతి చౌదరి పేరును జగపతి బాబు గా పేరు మార్చారు. సొంత బ్యానర్ జగపతి పిక్చర్స్ బ్యానర్ పై తీసిన సింహస్వప్నం సినిమాతో జగపతి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి పిక్చర్ లోనే జగపతి బాబు ద్విపాత్రాభినయం చేశాడు. తర్వాత చేసిన సినిమాల మాట ఎలా ఉన్నా పెద్దరికం అతనికి బ్రేక్ ఇచ్చింది. గాయం లో చేసిన జగపతి బాబు యాక్షన్ హీరోగా కూడా నిరూపించుకున్నాడు. ఆ వెంటనే వరసగా శుభలగ్నం, మావిచిగురు, శుభాకాంక్షలు, సామాన్యుడు, బడ్జెట్ పద్మనాభం, స్వాగతం వంటి సినిమాలు జగపతిబాబును ఫ్యామిలీ హీరోను చేశాయి.

ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకోవడం కూడా కొంత కష్టమైన పనే. ఎందుకంటే ఆ కేరక్టర్స్ పవర్ ఫుల్ ఎమోషన్స్ తో సీరియస్ గా ఉంటాయి. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇక అంతఃపురం, సముద్రం, బ్రహ్మాస్త్రం , నగరం నిద్రపోతున్న వేళ వంటి వాటిలో చేసిన కేరక్టర్స్ కూడా జగపతిబాబుకు మంచి పేరు తెచ్చాయి. కేవలం ఎమోషనల్ కేరక్టర్సే కాక .. .. సర్దుకు పోదాం రండి, హనుమాన్ జంక్షన్ , సందడే సందడి, ఖుషీఖుషీగా వంటి పూర్తి సరదా చిత్రాలూ చేశాడు జగపతిబాబు. హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు కొన్నేళ్ల తర్వాత సడెన్ గా టర్నింగ్ ఇచ్చాడు. లెజెండ్ సినిమాలో విలన్ గా వేసి – నెగెటివ్ కేరక్టర్ కూడా వేయగలనని రుజువు చేసుకున్నాడు. రీసెంట్ గా మన్నెంపులి, ఇజం, ఓం నమో వేంకటేశాయ లో కూడా నటించాడు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు వెరైటీ కేరక్టర్స్ కూడా వేసి మెప్పించాడు. బర్త్ డే సందర్బంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

1588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles