ఫోన్, ట్విట్ట‌ర్ హ్యాక్ అయిందంటున్న హ‌న్సిక‌

Thu,January 24, 2019 08:48 AM

బొద్దుగుమ్మ హ‌న్సిక ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్‌ని అందుకొని ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌తో బిజీ అయింది. ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు 49 సినిమాలు పూర్తి చేసిన హ‌న్సిక త్వ‌ర‌లో త‌న 50వ చిత్రం మ‌హాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నూతన దర్శకుడు జమీల్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో జరిగే కథ ఇది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హ‌న్సిక త‌న సినిమా విశేషాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని కూడా షేర్ చేస్తుంటుంది. ఈ మ‌ధ్య హ‌న్సికకి సంబంధించిన హాట్ పిక్స్ కొన్ని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ షాక్‌కి గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో హ‌న్సిక త‌న ట్విట్ట‌ర్ లో నా ఫోన్ మ‌రియు ట్విట్ట‌ర్ హ్యాక్ అయింది. ఏ మెసేజ్‌కి మీరు స్పందించ‌వద్దు. నా బ్యాక్ ఎండ్ టీం దీనిపై విచార‌ణ జ‌రిపి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అనే కామెంట్ పెట్టింది. హ‌న్సిక ఇటీవ‌ల తెలుగులో క‌థానాయకుడు చిత్రంలో జ‌య‌ప్ర‌ద పాత్ర‌లో మెరిసిన విష‌యం విదిత‌మే.1557
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles