న‌డిగ‌ర్ సంఘంలో హ‌న్సిక‌పై ఫిర్యాదు చేసిన మేనేజ‌ర్‌

Tue,March 13, 2018 03:43 PM
hansika manager fire on her

గ్లామ‌ర్ బ్యూటీ హ‌న్సిక‌పై ఆమె మేనేజ‌ర్ మునుస్వామి చీటింగ్ కేసు పెట్టాడు. చాన్నాళ్ల నుండి ఆమె ద‌గ్గ‌ర మేనేజ‌ర్‌గా చేస్తున్న త‌న‌కి హ‌న్సిక ఎంత‌కు మ‌నీ సెటిల్‌మెంట్ చేయడం లేదంటూ మునుస్వామి న‌డిగ‌ర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు. జ‌న‌ర‌ల్‌గా హ‌న్సిక డేట్స్‌తో పాటు రెమ్యున‌రేష‌న్ విష‌యాల‌ని ఆమె త‌ల్లే చూసుకుంటారు. కాని మునుస్వామి అనే వ్య‌క్తి చెబుతున్న మాట‌లు అభిమానుల‌కి షాకింగ్‌గా మారాయి. ప్రూఫ్స్‌తోనే నేను మాట్లాడుతున్నానని మునుస్వామి చెప్ప‌డం గ‌మ‌న‌ర్హం. అయితే హ‌న్సిక ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వివాదంపై నోరు విప్ప‌లేదు. ప్ర‌స్తుతం తాను విక్ర‌మ్ ప్ర‌భు హీరోగా తెర‌కెక్కుతున్న తుపాకి మున్నై అనే చిత్రం చేస్తుంది. దీంతో పాటు సామ్ ఆంట‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో అధ‌ర్వ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తెలుగుతో పాటు త‌మిళంలోను ప‌లువురు టాప్ స్టార్స్ స‌ర‌స‌న న‌టించిన హ‌న్సిక విష‌యంలో ఇలాంటి వార్త‌లు రావ‌డం అభిమానుల‌ని ఆందోళ‌నకి గురి చేస్తుంది.

2618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS