హ‌న్సిక లుక్ అదిరిందంతే..!

Fri,June 23, 2017 03:38 PM
hansika look from GAUTAM NANDA

మాచో హీరో గోపిచంద్ ప్ర‌ధాన పాత్ర‌లో సంపత్ నంది తెర‌కెక్కిస్తున్న చిత్రం గౌత‌మ్ నంద‌. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కేథ‌రిన్ థెస్రా, హ‌న్సిక క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అయితే మూవీ ప్ర‌మోష‌న్ లో భాగంగా సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించి ఫ‌స్ట్ లుక్స్ రివీల్ చేస్తుంది చిత్ర యూనిట్. తాజాగా హ‌న్సిక రావిషింగ్ లుక్ విడుద‌ల చేశారు. తంబూర‌ ప‌ట్టుకొని ఉన్న హ‌న్సికని చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. స్పూర్తి అనే పాత్ర‌లో హ‌న్సిక క‌నిపించ‌నుంది. గౌత‌మ్ నంద చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించ‌గా, ఈ చిత్రాన్ని జె. భగవాన్, జె. పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ చిత్ర రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేక‌ర్స్.



2917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles