హ‌న్సిక 50వ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sun,December 9, 2018 12:37 PM
Hansika 50th film titled Maha first look

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలి ఇప్పుడు కోలీవుడ్‌లో స్థిరపడిపోయిన‌ ముద్దుగుమ్మ హన్సిక . ప్ర‌స్తుతం త‌న 50వ చిత్రంగా యూఆర్ జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హా అనే చిత్రం చేస్తుంది. హీరోయిన్ సెంట్రిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లైంది. ఇందులో హ‌న్సిక డిఫ‌రెంట్ షేడ్స్‌లో వెరైటీ లుక్‌లో క‌నిపిస్తుంది. గ‌తంలో ఎప్పుడు చేయ‌ని పాత్ర‌ని హ‌న్సిక ఈ చిత్రంలో చేస్తుంద‌ని అంటున్నారు. ఇందులో విల‌క్ష‌ణ పాత్ర చేస్తున్న హ‌న్సిక ఎమోష‌న్స్‌ని అద్భుతంగా పండించ‌నుంద‌ట‌. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌గా, సినిమాటోగ్రాఫ‌ర్‌గా మార్క‌స్ పని చేస్తున్నారు. హ‌న్సిక తెలుగులో సందీప్ కిష‌న్ తో క‌లిసి జి. నాగేశ్వరరెడ్డి దర్వకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.యల్’ అనే మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

3395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles