వివాదంలో హ‌న్సిక మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

Thu,December 13, 2018 01:00 PM
Hansika 50th Film in controversy

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన హ‌న్సిక ప్ర‌స్తుతం కొంత స్లో అయింది .ఆచి తూచి అడుగులు వేస్తుంది . ప్ర‌స్తుతం త‌న 50వ చిత్రంగా యూఆర్ జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హా అనే చిత్రం చేస్తుంది హ‌న్సిక‌. హీరోయిన్ సెంట్రిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల‌ విడుద‌లైంది. ఇందులో హ‌న్సిక డిఫ‌రెంట్ షేడ్స్‌లో వెరైటీ లుక్‌లో క‌నిపించే స‌రికి అభిమానులు పండుగ చేసుకున్నారు. కాని ఇప్పుడు ఈ మూవీ పోస్ట‌ర్ వివాదాల‌లో నిల‌వ‌డంతో చిత్ర యూనిట్ షాక్ లో ఉంది.

మ‌హా మూవీ ఫ‌స్ట్ లుక్‌లో హ‌న్సిక స‌న్యాసులు ధ‌రించే కాషాయ వ‌స్త్రాలు ధ‌రించి సింహాసనంపై కూర్చొని హుక్కా తాగుతున్న‌ట్టుగా ఉంది. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ పీఎంకే పార్టీ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించటంతో సినిమా రిలీజ్‌పై సందిగ్ధం నెల‌కొంది. చిత్రంలో ఎప్పుడు చేయ‌ని పాత్ర‌ని హ‌న్సిక చేస్తుంద‌ని అంటున్నారు. ఇందులో విల‌క్ష‌ణ పాత్ర చేస్తున్న హ‌న్సిక ఎమోష‌న్స్‌ని అద్భుతంగా పండించ‌నుంద‌ట‌. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌గా, సినిమాటోగ్రాఫ‌ర్‌గా మార్క‌స్ పని చేస్తున్నారు. హ‌న్సిక తెలుగులో సందీప్ కిష‌న్ తో క‌లిసి జి. నాగేశ్వరరెడ్డి దర్వకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.యల్’ అనే మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

1860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles