రాజ్ కుమార్ రావుతో ప్రేమ‌లో ప‌డ్డ ఐశ్వ‌ర్య‌రాయ్

Sun,July 15, 2018 12:55 PM
Halka Halka Video from fanney khan

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ న‌టిస్తున్న తాజా చిత్రం ఫ‌న్నేఖాన్. అతుల్ మంజ్రేకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఐష్ ఇందులో పాప్ సింగర్ గా కనిపిస్తోంది. లైవ్ షో ఈవెంట్ లో భాగంగా ఆడియన్స్ ని అల‌రిస్తుంటుంది. అనీల్ కపూర్ , రాజ్ కుమార్ రావు కూడా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మంచి గాయకుడు కావాలనే కోరిక తీర్చుకోలేని తండ్రి పాత్రలో అనీల్ కపూర్ నటించారు. అనిల్ కపూర్ గాయకుడు అవ్వాలన్న చిరకాల కోరికను తన కూతురు ద్వారా తీర్చుకోవాలనుకుంటాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా గాయకుడు కాలేని అనిల్ కపూర్ తన స్నేహితుడు రాజ్ కుమార్ రావు సాయంతో పాప్ స్టార్ ఐశ్వర్యారాయ్ ని కిడ్నాప్ చేస్తాడు. అనిల్ కపూర్ తన కలను ఎలా నెరవేర్చుకున్నాడన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.

ఆగస్ట్ 3న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ జ‌రుగుతుంది. ఇటీవ‌ల మొద‌టి సాంగ్ విడుద‌ల చేసిన టీం తాజాగా రెండో సాంగ్ విడుద‌ల చేసింది. హ‌ల్కా హ‌ల్కా అంటూ సాగే ఈ పాట‌లో ఐష్‌, రాజ్ కుమార్ స‌ర‌దాగా క‌నిపించ‌డం, వీధుల్లో డ్యాన్స్ చేయ‌డం, బైక్‌పై చ‌క్క‌ర్లు కొట్ట‌డం సాంగ్‌లో క‌నిపించింది . బేబి సింగ్ పాత్ర పోషించిన ఐష్‌, ఆదిర్ పాత్ర పోషించిన రాజ్ కుమార్ రొమాన్స్ కూడా రెండు నిమిషాల సాంగ్‌లో చూపించారు. ఫన్నేఖాన్ ఆజ్ఞ పాటించిన ఆదిర్‌.. బేబి సింగ్‌ని కిడ్నాప్ చేస్తాడు. అత‌ని చిలిపి చేష్ట‌లు బేబి సింగ్‌కి న‌చ్చ‌డంతో అత‌నిపై ప్రేమ పెంచుకుంటుంది . ఆ సంద‌ర్భంలో వ‌చ్చే సాంగ్ తాజాగా విడుద‌లైంది. అమిత్ త్రివేది కంపోజ్ చేసిన ఈ పాట‌ని సునిది చౌహన్‌, దివ్య కుమార్ క‌లిసి పాడారు . మీరు ఆ సాంగ్‌పై ఓ లుక్కేయండి.

5674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles