జాన్వీ కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..!

Wed,February 27, 2019 10:36 AM
Gunjan Saxena biopic title fixed

బోని క‌పూర్‌, శ్రీదేవిల ముద్దుల కూతురు జాన్వీ కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసేందుకు సిద్ధ‌మైంది. ధ‌డ‌క్ అనే చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం త‌క్త్ అనే మ‌ల్టీ స్టార‌ర్‌లో నటిస్తుంది.ఇదే కాకుండా ఐఏఎఫ్‌ విమానం నడిపిన తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత‌మాధారంగా తెర‌కెక్కుతున్న చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తుంది. గ‌త ఏడాది చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా ప్ర‌స్తుతం మూవీ చిత్రీక‌ర‌ణ ల‌క్నోలో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. జాన్వీ తండ్రిగా పంక‌జ్ న‌టిస్తున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ ఈ చిత్రంలో హీరోగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. నటుడు అంగద్ బేడీ. ఈ చిత్రంలో అంగద్ ,జాన్వీ కి సోదరుడిగా కనిపించనున్నారు. మార్చి నెలాఖ‌రుకి చిత్ర షూటింగ్ పూర్తి చేయాల‌ని టీం బావిస్తుంది. ఈ చిత్రానికి ‘కార్గిల్ గర్ల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట‌. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రం కోసం జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ తీసుకుంది. అయితే మ‌హిళా పైల‌ట్ గుంజ‌న్ 1999 కార్గిల్‌ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరిచే ప్ర‌శంస‌లు పొందింది. ఆమె ధైర్యానికి మెచ్చిన ప్ర‌భుత్వం శౌర్య‌వీర్ అవార్డ్ కూడా అందించింది. ఈమె జీవిత నేప‌థ్యంలో మూవీ రావ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం.

1471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles