అదరగొడుతున్న గల్లీ బాయ్ ట్రైలర్

Wed,January 9, 2019 03:30 PM
Gully Boy Trailer is out with a bang

సింబా హిట్‌తో ఊపు మీదున్న రణ్‌వీర్ సింగ్ ఈసారి గల్లీ బాయ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జోయా అక్తర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ బుధవారం విడుదలైంది. 2 నిమిషాల 42 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో రణ్‌వీర్, ఆలియా తమ పర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టారు. ముంబై మురికి వాడల్లో పెరిగిన ఓ యువకుడు.. ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. అప్నా టైమ్ ఆయేగా అనే క్యాప్షన్‌ను చూస్తేనే మూవీ ఉద్దేశమేంటో అర్థమవుతున్నది. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అంతకుముందే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీని ప్రదర్శించనున్నారు.

1748
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles