అనుష్క సైజ్‌జీరో లో గెస్ట్ రోల్స్

Mon,November 16, 2015 05:22 PM


హైదరాబాద్: రుద్రమదేవి చిత్రం తర్వాత టాలీవుడ్ యోగా బ్యూటీ అనుష్కా శెట్టి సైజ్‌జీరో తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమా సైజ్ జీరో.


అనుష్క, ఆర్య కాంబినేషన్‌లో వస్తున్న తాజా ప్రాజెక్టులో పలువురు స్టార్లు గెస్టులుగా తళుక్కుమననున్నారు. గెస్ట్ అప్పీరియరెన్స్ అంటే ఏ ఒక్కరో ఇద్దరో అనుకుంటే పొరపాటే. అనుష్కతో మంచి రిలేషన్‌షిప్ ఉన్న టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు అతిథులుగా కనిపించబోతున్నారని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. గెస్ట్‌ల జాబితాలో టాలీవుడ్ నుంచి నాగార్జున, రానా, హీరోయిన్లు హన్సిక, కాజల్ అగర్వాల్, తమన్నా, శ్రీదివ్య, రేవతి, మంచు లక్ష్మి, కోలీవుడ్ నుంచి రంగం ఫేం జీవా ఉన్నారు. అనుష్క, ప్రకాశ్‌కోవెలమూడి, ఆర్య తో ఉన్న మంచి స్నేహం వల్లే వీరంతా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.

ప్రయోగాత్మక చిత్రంగా వస్తున్న సైజ్ జీరో కోసం యోగా బ్యూటీ ఎంతో కష్టపడి 20కిలోల బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 27 న విడుదల కానుంది.

2741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles