యూట్యూబ్ నుండి జీఎస్టీ ట్రైల‌ర్ అవుట్‌ !

Thu,February 22, 2018 01:40 PM
యూట్యూబ్ నుండి జీఎస్టీ ట్రైల‌ర్ అవుట్‌ !

కాంట్ర‌వ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అనే షార్ట్ ఫిలిం తీసిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ తీసిన ఈ షార్ట్ ఫిలిం ప‌లు వివాదాలు సృష్టించింది. మ‌హిళా లోకం దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జీఎస్టీ వెబ్‌ సిరీస్‌ వివాదంపై నమోదైన కేసులో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారించి , త్వ‌ర‌లో మరోసారి పిలిపిస్తామ‌ని అన్నారు. అయితే త‌న స్క్రిప్ట్ కాపీ కొట్టి వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ షార్ట్ ఫిల్మ్‌ తీశారని గ‌త నెల‌లో ఆరోపించారు ర‌చ‌యిత‌ జయకుమార్ . వ‌ర్మ ద‌గ్గ‌రే ప‌ని చేసిన ఈ ర‌చ‌యిత ఫిర్యాదు మేర‌కు జీఎస్టీ ట్రైల‌ర్‌ని యూట్యూబ్ నుండి తొల‌గించిన‌ట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండ‌గా, జ‌య‌కుమార్ త‌న ఆఫీసులో దొంగ‌త‌నం చేస్తూ ప‌లు మార్లు ప‌ట్టుబ‌డ్డాడని వ‌ర్మ అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వ‌ర్మ .. నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో కాప్ డ్రామా తెర‌కెక్కిస్తున్న విష‌యం విదిత‌మే.

1619

More News

VIRAL NEWS