సినిమా టికెట్ల‌పై త‌గ్గిన జీఎస్టీ.. ప్రొడ్యూస‌ర్ల హ‌ర్షం

Sat,December 22, 2018 05:56 PM

హైద‌రాబాద్: సినిమా టికెట్లపై జీఎస్టీని త‌గ్గించ‌డం ప‌ట్ల ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఇది ప్ర‌గ‌తిశీల అడుగు అని గిల్డ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. వంద లోపు ఉన్న సినిమా టికెట్ ధ‌ర‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి త‌గ్గించారు. వంద పైన ఉన్న టికెట్ ధ‌ర‌పై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి త‌గ్గించారు. దీంతో ఫిల్మ్ వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేశాయి. జీఎస్టీ త‌గ్గ‌డం వ‌ల్ల ఇండ‌స్ట్రీలో పెట్టుబ‌డులు పెరుగుతాయ‌ని గిల్డ్ అభిప్రాయ‌ప‌డింది. ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఊతం ఇస్తున్న కేంద్ర ప్ర‌భుత్వానికి స‌హ‌కరిస్తూనే ఉంటామ‌ని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ సిద్ధార్ధ రాయ్ కపూర్ లేఖ‌లో వెల్ల‌డించారు. కేంద్రం తీసుకున్న చ‌ర్య హ‌ర్ష‌ణీయ‌మ‌ని, మోదీకి థ్యాంక్స్ అంటూ బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ట్వీట్ చేశారు.





3078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles