సినిమా నుండి త‌ప్పుకుంటే 100 కోట్ల ఆఫ‌ర్

Sun,October 21, 2018 12:51 PM
great offer to rajamouli movie producer

మ‌రి కొద్ది రోజుల‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి సినిమాతో తెలుగోడి ఖ్యాతిని ప్ర‌పంచ దేశాల‌కి ప‌రిచ‌యం చేసిన రాజ‌మౌళి త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌గా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మ‌ల్టీ స్టారర్ చేయ‌నున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా,మ‌రో వైపు ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. అయితే ఒక‌వైపు ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి మ‌రోవైపు ఇద్ద‌రు స్టార్ హీరోలు. వీరి కాంబినేష‌న్‌లో చిత్రం అంటే ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ క్రమంలో ఎంత ఖ‌ర్చుతో అయిన నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఇటు తెలుగు రాష్ట్రాల నుండే కాక ఓవ‌ర్సీస్ నుండి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం నిర్మాత‌గా ఉన్న దాన‌య్య ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంటే ఆయ‌న‌కి వంద కోట్లు ఇచ్చేందుకు అయిన సిద్ధ‌మ‌ని వారు అంటున్నార‌ట‌. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

2020లో విడుద‌ల కానున్న రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ సినిమాకి కీరవాణి సంగీతం అందించ‌నున్నారు. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ అనే టైటిల్ తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ చిత్ర కథ బ్రిటీష్ కాలం నేపథ్యంలో జరగుతుందట. రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ల నిర్మాణాలు అన్ని బ్రిటీష్‌ నేపథ్యానికి, అప్పటి వాతావరణానికి త‌గ్గ‌ట్టుగా నిర్మిస్తున్నార‌ట‌. ఆ సెట్స్ లో వాడే ప్రాపర్టీస్ కూడా అన్ని ఆ కాలం నాటివేనని తెలుస్తోంది. చిత్ర షూటింగ్ లో మొదటగా ఎన్టీఆర్ పాల్గొంటాడు. ఎన్టీఆర్ పై కొంత భాగం చిత్రీకరించిన తర్వాత రామ్ చరణ్ షూట్ లో జాయిన్ అవుతాడు. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ కూడా ఒక డ్రాఫ్ట్ పూర్తయింది. ప్రస్తుతం ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

8713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles