'గౌరీ'.. పాడ్‌మాన్‌ అంత పెద్దది కాదు.. ఇది షార్ట్‌ ఫిల్మ్‌

Fri,May 10, 2019 05:26 PM
Gowri Short Film On Menstrual Hygiene

మీరు బాలీవుడ్‌లో వచ్చిన పాడ్‌మాన్ సినిమా చూశారా? అక్షయ్ కుమార్ అందులో పాడ్‌మాన్‌గా నటించాడు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు నెలసరి సమయంలో పాతగుడ్డలు వాడి.. అనారోగ్య సమస్యలకు గురవడం చూసి చలించిన అక్షయ్.. తక్కువ ధరకు సొంతంగా శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తాడు. దానిపై అందరిలో అవగాహన తీసుకొస్తాడు. ఆయన చేసిన పనిని గ్రామస్తులు వ్యతిరేకించినా.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆయన చేసిన గొప్ప పనిని గుర్తిస్తుంది.

సరే.. అది సినిమా.. కానీ నిజంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు శానిటరీ ప్యాడ్స్‌పై అవగాహన ఉందా? ఇంకా నెలసరి సమయంలో ఇంట్లోని పాత గుడ్డలనే వాడుతున్నారా? దాని వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. నిజంగా నెలసరి వచ్చినప్పుడు ఇంట్లోని ఏ వస్తువులనూ ముట్టుకోకూడదా? దేవుడికి మొక్క కూడదా? అన్నం వండకూడదా? వాటన్నింటికీ షార్ట్ అండ్ స్వీట్‌గా గౌరి అనే షార్ట్‌ఫిలింలో సమాధానం చెప్పారు. ఆదాన్ మీడియా ఆధ్వర్యంలో వచ్చిన ఈ షార్ట్ ఫిలిం.. శుభ్రమైన శానిటరీ ప్యాడ్స్‌ను వాడాలని చెప్పడం కోసం చేసిన చిన్న ప్రయత్నం. ఇంకెందుకు ఆలస్యం.. గౌరీ అనే అమ్మాయి శానిటరీ ప్యాడ్స్ ప్రాముఖ్యతను తన స్కూల్‌లో ఎలా తెలుసుకుందో ఈ వీడియోలో చూసేయండి.

1795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles