డ్యాన్సింగ్ అంకుల్ ఫోటోపై గోవిందా కామెంట్

Wed,June 27, 2018 10:09 AM
Govinda shares post on dancing uncle Sanjeev Shrivastava

బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా సినిమాలోని 'ఆప్ కె ఆ జానె సె' అనే పాటకు సంజీవ్ శ్రీవాత్సవ్ అనే ప్రొఫెస‌ర్ వేసిన స్టెప్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గా ఆక‌ట్టుకున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్క వీడియోతోనే ఆయ‌న సెల‌బ్రిటీ అయ్యాడు. అత‌ని ప్ర‌తిభ‌కి ముగ్ధుడైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గ‌ర్వంగా ఫీల‌వుతూ ట్వీట్ కూడా చేశాడు. మధ్యప్రదేశ్ నీళ్లలోనే ఓ విశేషం ఉందని అన్నారు . ఇక ఫిల్మ్ స్టార్స్ రవీనా టండన్, దివ్యా దత్, అర్జున్ క‌పూర్‌ కూడా వీడియోపై త‌మ స్పంద‌న తెలియ‌జేశారు . ‘డాన్సింగ్‌ అంకుల్‌’, డ‌బ్బు అంకుల్‌గా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన విదిషా వాసి సంజీవ్ ఇటీవ‌ల సల్మాన్ ఖాన్ దస్ కా దమ్ కార్యక్రమంలో పాల్గొని.. సల్లూ భాయ్ పక్కన కూడా డ్యాన్స్ వేసేశాడు. త‌న ఫ్యామిలీతో క‌లిసి ఫోటోలు దిగాడు.

రీసెంట్‌గా మాధురీ దీక్షిత్ జ‌డ్జ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న డ్యాన్స్ షో దీవానేకి హాజ‌రైన సంజ‌య్ శ్రీ వాత్స‌వ్ త‌న అభిమాన హీరో గోవిందాని క‌లిసాడు. స్టేజ్‌పై గోవిందాతో స్టెప్పులు వేసి అక్కడి వారికి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించాడు. ఇక త‌న దేవుడితో డ్యాన్స్ చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని అన్నాడు డ్యాన్సింగ్ అంకుల్‌. ఇక గోవిందా కూడా త‌న‌ని అంత‌గా అభిమానించే వ్య‌క్తితో డ్యాన్స్ చేయ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపాడు. అయితే గోవిందా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సంజ‌య్‌తో క‌లిసి స్టెప్పులేసిన ఫోటోని షేర్ చేస్తూ ..సంజ‌య్ శ్రీవాత్స‌వ్ లాంటి వ్య‌క్తులు ఇచ్చే ప‌ర్‌ఫార్మెన్స్ చూసే వారికి ఉత్తేజాన్ని క‌లిగిస్తుంది. మీ లాంటి వ్య‌క్తుల‌ని క‌ల‌వ‌డం నాకు ఆనందాన్ని ఇస్తుంది. డ్యాన్సింగ్‌లో మీరు నాక‌న్నా జోష్‌తో చేస్తున్నారు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు గోవిందా. ఈ పోస్ట్‌కి బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ .. చీ చీ సార్ .. మీరే కింగ్ అంటూ రిప్లై ఇచ్చారు.

1929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles