కూతురి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన గౌత‌మి

Tue,March 13, 2018 12:44 PM
కూతురి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన గౌత‌మి

అప్ప‌టి హీరోయిన్ గౌత‌మి త‌న కూతురి వెండితెర ఎంట్రీపై ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. బాల తెర‌కెక్కిస్తున్న అర్జున్ రెడ్డి రీమేక్‌లో ధృవ్ స‌ర‌స‌న గౌత‌మి కూతురు సుబ్బ‌ల‌క్ష్మీ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని, సెకండ్ షెడ్యూల్‌లో ఈ అమ్మ‌డు టీంతో జాయిన్ కానుంద‌ని పుకార్లు షికారు చేశాయి. దీనిపై గౌత‌మి పూర్తి క్లారిటీ ఇచ్చింది. సుబ్బ‌ల‌క్ష్మీ ప్ర‌స్తుతం చ‌దువుపైనే పూర్తి దృష్టి పెట్టింది. న‌ట‌న వైపు వెళ్ళే ఆలోచ‌న ప్ర‌స్తుతం త‌న‌కైతే లేదు. మీ అంద‌రి బ్లెస్సింగ్స్ త‌న‌కి అందించినందుకు కృత‌జ్ఞ‌త‌లు అని తెలిపింది. సుబ్బ‌ల‌క్ష్మీ.. గౌత‌మి మొద‌టి భ‌ర్త వ‌ల‌న క‌లిగిన సంతానం అన్న సంగ‌తి తెలిసిందే. మొత్తానికి గౌత‌మి క్లారిటీతో అభిమానులు మ‌ళ్ళీ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అర్జున్ రెడ్డి రీమేక్ వ‌ర్మ‌లో క‌థానాయిక ఎవ‌ర‌నే దానిపై సస్పెన్స్ నెల‌కొంది.


1811

More News

VIRAL NEWS