గోపిచంద్ అభిమానుల‌కు గుడ్ న్యూస్

Thu,July 6, 2017 01:12 PM
Goutham Nanda release date fixed

ఒకప్పుడు విల‌న్ గా అల‌రించిన గోపిచంద్ కాస్త టర్న్ తీసుకొని హీరోగా మారాడు. కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ అందరి అభిమానాన్ని దక్కించుకుంటున్నాడు. లౌక్యం, జిల్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన గోపిచంద్ ఆ తర్వాత సౌఖ్యం తో బోల్తా పడ్డాడు. కొన్నేళ్ళుగా గోపిచంద్ మూవీ ఒక్క‌టి కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో అభిమానులు కాస్త డ‌ల్ అయ్యారు. ఈ క్ర‌మంలో వారి ఆనందాన్ని పెంచేందుకు వ‌రుస సినిమాలు రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు ఈ మాచో హీరో .

అయితే ఈ మ‌ధ్య గోపిచంద్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆక్సీజ‌న్, ఆర‌డుగుల బుల్లెట్, గౌత‌మ్ నందా చిత్రాలు తెర‌కెక్కాయి. ఆక్సీజ‌న్ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా ఇప్ప‌టికి దాని ఊసే లేదు. ఇక బి. గోపాల్ తెర‌కెక్కించిన ఆర‌డుగుల బుల్లెట్ జూన్ 9న విడుద‌ల కావ‌ల‌సి ఉంది. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ మూవీ వాయిదా ప‌డింది. ఇక గోపిచంద్ -సంప‌త్ నంది కాంబినేష‌న్ లో రూపొందిన గౌత‌మ్ నంద పైనే ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో జులై 28న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో ప్రీ రిలీజ్ వేడుక‌ని జ‌ర‌పాల‌ని ప్లాన్ చేశారు. అయితే కనీసం ఈ సినిమా అయిన విడుద‌లై మంచి విజ‌యం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు

1603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS