గోపీచంద్ ‘చాణక్య’ టీజర్ వచ్చేసింది..

Mon,September 9, 2019 09:03 PM
Gopichand Chanakya teaser is out


పంతం సినిమా తర్వాత గోపీచంద్ నటిస్తోన్న చిత్రం చాణక్య. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సర్ మనం రెండు జీవితాలు లీడ్ చేస్తున్నాం..ఒకటి నిజం..మరొకటి అబద్దం అంటూ చెప్పే సంభాషణలతో ప్రారంభమవుతోంది. యాక్షన్ సన్నివేశాలతో కొనసాగే టీజర్ సస్పెన్స్ గా కొనసాగుతోన్న టీజర్ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాలో మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్. చాణక్య గోపీచంద్ కు 26వ చిత్రం. పంతం సినిమా బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో..చాణక్యపైనే ఆశలు పెట్టుకున్నాడు గోపీచంద్.

899
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles