విలన్ గా టర్న్ తీసుకుంటున్న హీరో

Tue,May 30, 2017 01:37 PM
gopi chand turned to be villain

ఒకప్పుడు ప్రతి నాయకుడి పాత్రలలో నటించి మెప్పించి ఆ తర్వాత హీరోలుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి హీరోలుగా ఓ రేంజ్ లో అలరించిన స్టార్స్ విలన్ గా నటించేందుకు సై అంటున్నారు. ఇందుకు ఉదాహరణ జగపతి బాబు, శ్రీకాంత్, సాయి కుమార్ , సుమన్ ఇలా చాలా మంది హీరోలే ఉన్నారు. ఇప్పుడు వీరి దారిలో మరో హీరో కూడా వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. జయం, నిజం, వర్షం చిత్రాలలో విలన్ గా నటించి ఆ తర్వాత హీరోగా మారాడు మాచో హీరో గోపిచంద్. ప్రస్తుతం గోపిచంద్ నటించిన ఆక్సీజన్, ఆరడుగుల బుల్లెట్, గౌతమ్ నందా చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అయితే సంపత్ నంది తెరకెక్కిస్తున్న గౌతమ్ నందా చిత్రంలో గోపి అటు హీరోగా, ఇటు విలన్ గా డ్యూయల్ రోల్ పోషించనున్నట్టు సమాచారం. గతంలో సూర్య, కమల్, శింబు తదితరులు విలన్ గా నటించి మెప్పించగా , ఇప్పుడు ఆ ఛాలెంజింగ్ రోల్ కి గోపి చంద్ ఎలాంటి న్యాయం చేస్తాడో చూడాలి.

1884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS