మరోసారి తండ్రైన గోపిచంద్

Fri,September 14, 2018 09:05 AM
gopi chand becomes father again

మాచో హీరో గోపిచంద్ మ‌రోసారి తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్నాడు. వినాయ‌క చవితి రోజున త‌న భార్య పండంటి బిడ్డకు జ‌న్మ‌నివ్వ‌డంతో ఆ ఆనందాన్ని ఫేస్ బుక్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. మాకు మళ్లీ బాబు పుట్టాడు. వినాయక చవితి పండుగ రోజున ఇంతకంటే బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ ఇంకేం ఉండదు అని త‌న పోస్ట్ లో తెలిపాడు గోపిచంద్‌. 2013 మే నెలలో గోపిచంద్.. రేష్మ‌ని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి 2014 అక్టోబర్లో మొదటి అబ్బాయి పుట్టాడు. అతడికి గోపీచంద్ తండ్రి పేరు కలిసి వచ్చేలా విరాట్‌ కృష్ణ అని పేరు పెట్టారు. శ్రీకాంత్ బంధువు అయిన రేష్మాని గోపిచంద్ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. బీటెక్ చ‌దివిన రేష్మా త్రీడీ యానిమేష‌న్, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ల‌పై ప‌ట్టు సాధించింది. ప్ర‌స్తుతం గోపిచంద్ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు.

7068
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles